‘హర్ ఘర్ తిరంగా’ను పండుగలా జరుపుకోవాలి
మేడిపల్లి, ఆగస్టు 12 (విజయక్రాంతి): హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ప్రతి ఇంటా ఒక పండుగలా జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వ అడిషనల్ స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్ నరేష్ కుమార్ నర్సింగోజు అన్నారు. ఆగస్టు 15 దేశ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా మేడిపల్లి లోని ఉప్పల్ కోర్ట్ కాంప్లెక్స్ యందు నరేష్ కుమార్ ఆధ్వర్యంలో జాతీయ న్యాయవాదులంతా కలిసి కోర్ట్ కాంప్లెక్స్ నుండి హనుమాన్ దేవాలయం వరకు ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయులు, ప్రతి పౌరుడు తమ తమ ఇంటిపై జాతీయ పతాకాన్ని సగర్వంగా ఎగురవేసి, హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ప్రతి ఇంటా ఒక పండగల జరుపుకోవాలని, ఈ మహత్తర దేశభక్తి వేడుకల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప్పల సుధాకర్, శ్రీకాంత్, రవి గౌడ్, వంశి క్రిష్ణ, చంద్ర శేఖర్, భారత్, నరేష్, జయ, సూర్యం స్వప్న, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.






