13 August, 2026 | 5:14 AM

ఘట్‌కేసర్‌లో హర్ ఘర్ తిరంగా ర్యాలీ

13-08-2026 01:49 AM

ఘట్ కేసర్, ఆగస్టు 12 (విజయక్రాంతి) : దేశ ప్రధాని నరేంద్రమోదీ, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు, జిల్లా పార్టీ ఆదేశాల మేరకు, హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ఘట్కేసర్ బస్టాండ్ నుండి శివారెడ్డిగూడ హనుమాన్ టెంపుల్ వరకు బిజెపి నాయకులు బుధవారం  ర్యాలీ నిర్వహించారు. దేశభక్తి నినాదాలతో, జా తీయ జెండాలతో ఘట్కేసర్ వీధుల్లో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది.

ఈ కార్య క్రమంలో ఘట్కేసర్ బిజెపి అధ్యక్షులు మహిపాల్ రెడ్డి, జిల్లా కార్యదర్శి, ఘట్కేసర్ ఇన్చార్జ్ జైపాల్ రెడ్డి, జిల్లా కార్యదర్శి హనుమాన్, హర్ ఘర్ తిరంగా జిల్లా కన్వీనర్ శ్రీనివాస్, డివిజన్ ప్రధాన కార్యదర్శి శ్రీధర్, రాధిక, కార్యదర్శి సిద్దిరాజు, సీనియర్ నాయకులు రామోజీ, మధు, యువమోర్చా అనిల్ గౌడ్, కో-కన్వినర్ సురేందర్ యాదవ్, బూత్ అధ్యక్షులు మాధవి, మమత శర్మ, తదితలు ర్యాలీని విజయవంతం చేశారు.