30 June, 2026 | 10:25 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

శివాలయ పున:నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన హంపి పీఠాధిపతి

21-03-2026 01:14 AM

50వ డివిజన్ లో ప్రవీణ్ రావును గెలిపిస్తే శివాలయాన్ని పునర్నిర్మిస్తామని హామీ ఇచ్చిన కేంద్ర మంత్రి

ముకరంపుర, మార్చి20(విజయక్రాంతి): హంపి విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతి శ విద్యారణ్య భారతి స్వామి   కరీంనగర్ 50వ డివిజన్ పరిధిలోని జ్యోతినగర్ కేడీఆర్ పార్కును సందర్శించారు. ఈ పార్కు స్థలం లో శిథిలావస్థలో ఉన్న శివాలయ పునర్ నిర్మించే అంశంపై స్థానికులతో మాట్లాడారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ 50వ డివిజన్ ప్రచారానికి వచ్చిన సందర్భంగా స్థానిక ప్రజలు కలిసి కేడీఆర్ పార్క్ లో శివాలయ పునర్నిర్మించాలని కోరారు.

సానుకూలంగా స్పందించిన బండి సంజయ్  కార్పొరేటర్ గా బోయినిపల్లి ప్రవీ ణ్ రావును గెలిపిస్తే కేడీఆర్ పార్కులో శివాలయ పునర్ నిర్మాణ పనులు చేపడతానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం వి ద్యారణ్య భారతి స్వామి  కరీంనగర్ రావడంతో కేంద్ర మంత్రి విజ్ఝప్తి మేరకు ప్రవీణ్ రావుతో కలిసి కేడీఆర్ పార్కును సందర్శించారు. శివాలయ పునర్మిర్మాణ పనులపై చర్చించారు.