30 June, 2026 | 11:27 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

నూతన విశ్రాంతి గదిని ప్రారంభించిన సీపీ

21-03-2026 01:16 AM

కరీంనగర్ క్రైం, మార్చి 20,(విజయక్రాంతి): పోలీస్ సిబ్బంది సంక్షేమం , పని తీరును మెరుగుపరిచే లక్ష్యంతో, కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం శుక్రవారంనాడు కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్లో నూ తనంగా నిర్మించిన విశ్రాంతి గదిని  ప్రారంభించారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లా డుతూ, నిరంతరం విధుల్లో ఉండే పోలీస్ సిబ్బందికి మానసిక ప్రశాంతత, శారీరక వి శ్రాంతి ఎంతో అవసరమని పేర్కొన్నారు.

సిబ్బంది ఆరోగ్యం, సౌకర్యాల విషయంలో రాజీ పడబోమని, మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా వారి పనితీరు మరింత మెరుగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో  ట్రైనీ ఐపీఎస్ సోహం సునీల్ , రూరల్ ఏసీపీ విజయకుమార్ , ట్రాఫిక్ ఏసీపీ వెంకటస్వామి , రూ రల్ ఇన్స్పెక్టర్ నిరంజన్ రెడ్డి తో పాటు ఎస్త్స్ర లు నరేష్ , లక్ష్మా రెడ్డి లతో పాటు ఇతర పో లీసు అధికారులు మరియు పోలీసు స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.