18 June, 2026 | 1:56 AM

కోచ్‌కు 20 ఏళ్లు, ప్రిన్సిపాల్‌కు 3 ఏళ్ల జైలు

18-06-2026 12:35 AM

2019లో మూడేళ్ల బాలికపై జిమ్నాస్టిక్ కోచ్ లైంగిక దాడి

శేరిలింగంపల్లి, జూన్ 17 (విజయక్రాంతి): మియాపూర్‌లోని ఒక ప్రైవేట్ పాఠశాలలో 2019లో మూడేళ్ల బాలికపై జిమ్నాస్టిక్స్ కోచ్ లైంగిక దాడి చేసిన కేసులో రాజేంద్రనగర్ పోక్సో న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది..కోచ్‌కు 20 ఏళ్ల కఠిన కారాగారం రూ.20వేలు జరిమానా, ప్రిన్సిపాల్‌కు మూడేళ్ల సాధారణ కారాగారం రూ.వెయ్యి జరిమానా విధించింది. బాధిత బాలికకు రూ.మూడు లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ మాట్లాడుతూ చిన్నారుల భద్రత విషయంలో పాఠశాలలు అప్రమత్తంగా ఉండాలని, నిర్లక్ష్యం చూపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.