జిమ్ ట్రైనింగ్ పేరుతో.. మహిళా పైలెట్‌ను లోబర్చుకునే ప్రయత్నం.. అరెస్ట్
జిమ్ ట్రైనింగ్ పేరుతో వేధింపులు
హైదరాబాద్: నగరంలోని తన జిమ్‌లో మహిళా పైలట్‌ను వేధించాడన్న ఆరోపణపై సనత్‌నగర్ పోలీసులు(Sanathnagar Police) కల్ట్ జిమ్ ట్రైనర్‌ను(Cult Gym Trainer) అరెస్టు చేశారు. పోలీసుల ప్రకారం, సంతోష్ గౌడ్ అనే వ్యక్తి సనత్‌నగర్‌లోని కల్ట్ జిమ్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్నారు. కొన్ని వారాల క్రితం, ఒక మహిళా పైలట్ ఆ జిమ్‌లో చేరారు. జిమ్ ట్రైనింగ్(Gym training) పేరుతో సంతోష్ తనను లోబర్చుకునేందుకు ప్రయత్నించాడని మహిళా పైలట్ ఫిర్యాదు చేసింది.
సంతోష్ గౌడ్ అతడి గర్ల్ ఫ్రెండ్ రజినీ సహకరించిందని పైలట్ తెలిపింది. ఒప్పుకోకపోవడంతో ఇన్ స్టాలో తనపై అసభ్య మెసేజ్ లు పెట్టారని పైలట్ ఫిర్యాదులో పేర్కొంది. మహిళా ఫిర్యాదు మేరకు పోలీసులు సంతోష్‌పై కేసు నమోదు చేసి అతన్ని అరెస్టు చేశారు. అతన్ని కోర్టులో హాజరుపరచగా, రిమాండ్‌కు తరలించారు.






