13 June, 2026 | 1:32 PM

అల్వాల్‌లో తీవ్ర విషాదం.. తండ్రీకూతుళ్ల ప్రాణం తీసిన భారీ వర్షం

13-06-2026 11:50 AM

మేడ్చల్-మల్కాజిగిరి: నగరంలో శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు(heavy rains) విద్యుత్ ఘాతానికి(Electric Shock) గురై తండ్రీకూతుళ్లు మరణించిన విషాదఘటన అల్వాల్‌లో(Alwal) చోటుచేసుకుంది. మృతులను సందీప్ (45), అతని కుమార్తె రితిక (16)గా గుర్తించారు. ఈ ఘటనలో సందీప్ భార్య శ్వేతకు స్వల్ప గాయాలయ్యాయి.

అందిన సమాచారం ప్రకారం, భారీ వర్షం కారణంగా వారి ఇంటి ముందు నిలిపి ఉంచిన కారుపై ఒక చెట్టు కూలింది. కింద పడిన కొమ్మలను తొలగించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు బాధితులు విద్యుత్ ప్రవహిస్తున్న తీగలను తాకడంతో ఈ విషాదకరమైన ప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తండ్రీకూతుళ్లు చనిపోవడంతో వారి కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.