31 March, 2026 | 3:16 PM

Breaking News

రవీంద్ర భారతి హై స్కూల్‌లో ప్రత్యేక సర్టిఫికెట్‌ల పంపిణీ కార్యక్రమం   •   అమీర్‌పేట నీటి సమస్యలపై తక్షణ స్పందన   •   ఇస్ఫాహాన్‌లో భీకర పేలుళ్లు! ఇరాన్ రహస్య నిలయంపై అమెరికా బాంబుల వర్షం   •   రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ విడుదల చేయాలి   •   గ్రంథాలయానికి పుస్తకాల విరాళం   •   బీజేపీలో చేరిన టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్   •   ట్యాంక్‌బండ్‌పై 4 కోట్లతో జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలు   •   వెలుగులోకి కల్తీ అల్లం పేస్ట్ వ్యవహారం... హైదరాబాద్‌లో వ్యాపారి అరెస్టు   •   చైత్ర మాసం చివరి రోజున ఆలయంలో తొక్కిసలాట: 8 మంది మృతి   •   గురుకుల విద్యను సద్వినియోగం చేసుకోవాలి   •  

ఈదురు గాలులకు నేలకొరిగిన వరి, జొన్న పంట

31-03-2026 01:17 PM

 ఆందోళన చెందుతున్న రైతన్నలు. 

నిజాంసాగర్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలోని, నిజాంసాగర్, మహమ్మద్ నగర్ మండలాల్లో సోమవారం రాత్రి వీచిన ఈదురుగాలులకు, వరి,  పంటలు నేలకొరిగాయి. అకాల వర్షాలు ఈదురు గలలతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆరుగాలం శ్రమించి పంట చేతికందే సమయంలో పంట నేలపాలు కావడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతుల కోరుతున్నారు. పంట నష్టం వివరాలపై మండల వ్యవసాయ అధికారులను వివరణ కోరగా పూర్తిస్థాయిలో పరిశీలించి పంట నష్టపోయిన రైతుల వివరాలను అందిస్తామని వారు తెలిపారు.