చెన్నైకి లక్నో టెన్షన్
- చెపాక్‌లో కీలక మ్యాచ్
- సూపర్ ఫామ్‌లో సంజూ
చెన్నై, మే 9 : ఐపీఎల్ 19వ సీజన్‌లో సె కండాఫ్ అత్యంత రసవత్తరంగా సాగుతోం ది. ఊహించని విధంగా కొన్ని జట్లు ప్లే ఆఫ్ రేసులోకి దూసుకొచ్చాయి. ఆరంభంలో వరుస పరాజయాలతో సతమతమైన చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పుడు వరుస విజయాలతో అదరగొడుతోంది. హోంగ్రౌండ్ చెపాక్ స్టేడి యం వేదికగా ఆదివారం లక్నో సూపర్ జె యింట్స్‌తో కీలక మ్యాచ్ ఆడబోతోంది. లక్నో దాదాపుగా ప్లే ఆఫ్ రేసుకు దూరమైనప్పటకీ సాంకేతికంగా ఇంకా నిలిచే ఉంది.
పైగా గత మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు షాకిచ్చింది. ఈ నేపథ్యంలో చెన్నై అప్రమత్తంగా ఆడకుంటే మాత్రం ఇబ్బందే. ఎందుకంటే ప్రస్తుతం సీఎస్కే 10 మ్యాచ్‌లలో ఐదు విజయాలతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతోంది. మిగిలిన నాలుగు మ్యాచ్‌లలో గెలిస్తే ప్లే ఆఫ్స్ కు చేరుతుంది. దీంతో లక్నోతో మ్యాచ్ కూడా ఆ జట్టుకు కీలకమే. గత రెండు మ్యా చ్‌లలో చెన్నై అదిరిపోయే ఆటతీరుతో ముం బై, ఢిల్లీ జట్లను ఓడించింది.
బౌలర్లు సమిష్టిగా రాణిస్తుండగా.. బ్యాటింగ్‌లో సంజూ శాంసన్ తన సూపర్ ఫామ్ కొనసాగిస్తున్నాడు. ముంబై ఇండియన్స్‌పై శతకంతో చెలరేగిన సంజూ తర్వాత ఢిల్లీపైనా 87 పరుగులతో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. అలాగే కార్తీక్ శర్మ కూడా ఫామ్ అందుకున్నాడు. గత రెండు మ్యాచ్‌లలో కీలక ఇన్నిం గ్స్‌లు ఆడి ఆకట్టుకున్నాడు. బ్యాటింగ్‌లో రుతురాజ్ గైక్వాడ్, ఉర్విల్ పటేల్, బ్రెవిస్ కూడా చెలరేగితే చెన్నైకి తిరుగుండదు. బౌ లింగ్‌లో ఓవర్టన్ సత్తా చాటుతున్నాడు.
ము కుల్ చౌదరి, అన్షుల్ కాంబోజ్‌తో పాటు స్పిన్నర్లు నూర్ అహ్మద్, అకిల్ హొస్సేన్ కూడా చెన్నై విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. హోంగ్రౌండ్‌లో ఆడుతుండడం కూడా సీఎస్కేకు కలిసొచ్చే అంశం. మరోవైపు ఈ సీజన్‌లోనూ పేలవ ప్రదర్శనతో నిరాశపరిచిన లక్నో సూపర్ జెయింట్స్ గత మ్యాచ్‌లో బెంగళూరుకు షాకిచ్చింది. మిఛెల్ మార్ష్ సెంచరీతో రెచ్చిపోయిన వేళ మూడో విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం పాయిం ట్ల పట్టికలో చిట్టచివరి స్థానంలో ఉన్న లక్నో మిగిలిన నాలుగు మ్యాచ్‌లు గెలిచినా 14 పాయింట్లతో ప్లే ఆఫ్ చేరే అవకాశాలు దాదాపుగా లేనట్టే. మిగిలిన జట్ల ఫలితాలు కూడా కలిసి రావాలి. అయితే ఇతర జట్ల అవకాశాలను ప్రభావితం చేసేందుకు లక్నో కు ఛాన్సుంది.
మార్ష్ నిలకడగానే రాణిస్తు న్నా పూరన్, పంత్ మాత్రం ఇంకా భారీ ఇన్నింగ్స్‌లు ఆడలేదు. ఈ సీజన్‌లో లక్నో ఓటమికి వారిద్దరి పేలవ బ్యాటింగే కారణం. కెప్టెన్ గానూ పంత్ పెద్దగా ఆకట్టుకోవడం లేదు. పైగా బ్యాటింగ్ ఆర్డర్‌లో లక్నో చేస్తున్న అనవసర ప్రయోగాలు కూడా ఓటములకు కారణమవుతున్నాయి. బౌలింగ్‌లో షమీ, ప్రిన్స్ యాదవ్ పేస్ ఎటాక్‌లో రాణిస్తున్నారు. స్పిన్నర్ దిగ్వేశ్‌తో పాటు షాబాజ్ అహ్మద్ కూడా లక్నోకు ఇప్పుడు కీలకంగా మారాడు. గత రికార్డులను చూస్తే లక్నోదే పైచేయిగా ఉంది. ఇరు జట్లు ఆరుసార్లు తలపడితే 3 మ్యాచ్‌లలో లక్నో గెలిచింది. ఇక చెపాక్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలించే అవకాశాలున్నాయి.
తుది జట్ల అంచనా
చెన్నై సూపర్‌కింగ్స్ : సంజూ శాంస న్, రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), ఉర్విల్ పటేల్, కార్తీక్ శర్మ, బ్రెవిస్, శివం దూబే, ఓవర్టన్, ప్రశాంత్ వీర్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, ముకేశ్ చౌదరి
లక్నో సూపర్‌జెయింట్స్ : మార్ష్, మాక్రరమ్, పంత్ (కెప్టెన్), ఇంగ్లీస్, పూర న్, రఘువంశీ, హిమ్మత్ సింగ్, షమీ, మోసిన్ ఖాన్, అవేశ్, ప్రిన్స్ యాదవ్






