calender_icon.png 12 February, 2026 | 9:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏయూలో హైడ్రోజన్ పవర్డ్ వెహికల్స్ పై గెస్ట్ లెక్చర్‌

12-02-2026 07:39:03 PM

ఘట్ కేసర్,(విజయక్రాంతి): అనురాగ్ యూనివర్సిటీ ఇన్సిట్యూషన్స్ ఇన్నోవేషన్ కౌన్సిల్, మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం సంయుక్తంగా హైడ్రోజన్ పవర్డ్ వెహికల్స్ అనే అంశంపై గెస్ట్ లెక్చర్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ బోర్డు సభ్యులు డాక్టర్ ఈ. రాజశేఖర్ రిసోర్స్ పర్సన్‌గా వ్యవహరించారు. ఆయన ఆటోమొబైల్ ఇంజనీరింగ్‌లో తాజా ధోరణులు, హైడ్రోజన్ వెహికల్స్ యొక్క ప్రాముఖ్యత, హైడ్రోజన్ వెహికల్ డిజైన్ గురించి స్పష్టంగా ఆసక్తికరంగా వివరించారు.

ఈ కార్యక్రమానికి వివిష్ట అతిథిగా  ఎస్ఏఈఐఎస్ఎస్ హైదరాబాద్ డివిజన్ చైర్మన్ ప్రొఫెసర్ ఎం. వెంకటేశ్వర్ రెడ్డి (హెడ్ మెకానికల్ ఇంజనీరింగ్) విచ్చేసి ఎస్ఏఈ క్లబ్ కార్యకలపాల గురించి అవగాహన కల్పించారు. ఈకార్యక్రమానికి డాక్టర్ కె.శ్రీనివాస చలపతి, అసోసియేట్ డీన్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ కె. శ్రీనివాస చలపతి, అసిస్టెంట్ హెడ్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కృష్ణయ్య హాజరయ్యారు. కార్యక్రమ సమన్వయకర్తగా అధ్యాపకులు కె. శ్రవణ్ కుమార్ వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో మెకానికల్ విభాగ విద్యార్థులు, అధ్యాపకులు, ఉత్సాహంగా పాల్గొన్నారు.