4 May, 2026 | 9:41 PM

పీఏసీఎస్ చైర్మన్‌గా గుడిపాటి సైదులు

04-05-2026 08:17 PM

ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులకు, ఎంపీ, ఎమ్మెల్యేకుకి కృతజ్ఞతలు తెలిపిన పాలకవర్గం

తుంగతుర్తి,(విజయక్రాంతి): తుంగతుర్తిమండల కేంద్రంలోని ది రైతు సేవా సహకార సంఘం (పీఏసీఎస్) చైర్మన్ గా గుడిపాటి సైదులు సోమవారం తిరిగి బాధ్యతలు స్వీకరించారు. హైకోర్టు తీర్పు మేరకు బాధ్యతలు చేపట్టిన ఆయన మాట్లాడారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతామని, ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేస్తామన్నారు.  రైతులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు.

రైతులకు సకాలంలో యూరియా,  ఎరువులు, విత్తనాలను అందజేస్తూ సొసైటీ బలోపేతం కోసం కృషి చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే మందుల సామేలుకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం సొసైటీ ఇంఛార్జీ పర్సన్ గా పనిచేస్తున్న బడే సాబ్ ను శాలువాతో సన్మానించారు.