4 May, 2026 | 9:14 PM

ఫతేపూర్‌లో పంట జొన్నకు మంట.. రైతుకు నష్టం

04-05-2026 08:16 PM

కల్హేర్,(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండల పరిధిలోని ఫతేపూర్ గ్రామానికి చెందిన బంజే శంకరప్ప తండ్రి నాగప్ప అనే రైతు జొన్న చేనులో నిప్పంటుకొని కాలిపోయిన ఘటన ఫతేపూర్ గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థాని కులు తెలిపిన వివరాలు.. బంజే శంకరప్ప ఎకరం విస్తీర్ణంలో జొన్న పంట సాగు చేశాడు.

పంట కోత దశకు రావడంతో ఆదివారం ఉదయం చేనులో మంటలు చెలరేగి చేనులో మొత్తం మంటలు వ్యాపించి మంటలు అంటుకున్నాయి. సమాచారం మేరకు రైతు అక్కడికి చేరుకొని మంటలను ఆర్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. ఈ మేరకు అందజా 20-30 క్వింటాళ్ల జొన్నలు దగ్ధమ య్యాయని కనీసం 40-50 వేల ఆస్థినష్టం జరిగిందని, రైతును ప్రభుత్వం ఆదుకోవాలని రైతు వాపోయాడు.