4 May, 2026 | 9:20 PM

అంగన్వాడీ కేంద్రంలో సమస్యల పరిష్కారానికి చర్యలు

04-05-2026 08:20 PM

మఠంపల్లి,(విజయక్రాంతి): మఠంపల్లి మండలంలోని కృష్ణ తండ గ్రామంలో ఉన్న 1వ అంగన్వాడీ సెంటర్‌ను గ్రామ సర్పంచ్ బాణోతు రమాదేవి శంకర్ నాయక్ సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్రంలో నిర్వహణ విధానం, సదుపాయాలపై సమగ్రంగా పరిశీలన చేపట్టారు. రికార్డులను తనిఖీ చేసి పిల్లలకు అందుతున్న పోషకాహారం,సేవలపై వివరాలు తెలుసుకున్నారు.

అంగన్వాడీ కేంద్రంలో ఉన్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. పిల్లల ఆరోగ్యం, పోషణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. గ్రామంలో అంగన్వాడీ సేవలు మెరుగుపడేలా అవసరమైన సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. స్థానికులు కూడా తమ సమస్యలను వెల్లడించగా, వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామని సర్పంచ్ తెలిపారు.