28 August, 2026 | 4:11 AM

కాంగ్రెస్‌కు పెరుగుతున్న ఆదరణ

28-08-2026 02:19 AM

బండి రమేష్

కూకట్ పల్లి, ఆగస్టు 27 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీకి రోజు రోజుకు ప్రజలలో ఆదరణ పెరుగుతోందని టిఫిసిసి ఉపాధ్యక్షులు, కూకట్ పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బండి రమేష్ అన్నారు.కూకట్ పల్లి నియోజకవర్గ పరిది అల్లాపూర్ డివిజన్ శివాజీనగర్ లో గురువారం బండి రమేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ పార్టీలకు చెందిన నాయకుకలు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రజాసంక్షేమ, అభివృద్ధి కార్యక్రమా లకు ఆకర్శితులై కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారన్నారు.కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రతీ ఒక్కరి కి హృదయపూర్వకంగా స్వాగతం ప లుకుతున్నానని, పార్టీని మరింత బలోపేతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, బ్లాక్ అధ్యక్షులు, మార్కెట్ కమిటీ అధ్యక్షులు, టెంపుల్ కమిటీ అధ్యక్షులు, డివిజన్ ల అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.