28 August, 2026 | 9:04 AM

సైబరాబాద్‌లో అక్రమ భవనాలపై కొరడా!

28-08-2026 02:17 AM

ఒక్క రోజే 21 కట్టడాలు నేలమట్టం

శేరిలింగంపల్లి, ఆగస్టు 27 (విజయక్రాంతి): గచ్చిబౌలి అంజయ్యనగర్లో ఏడంతస్తుల అక్రమ భవనం కూలి ఇద్దరు కార్మికులు మ రణించిన దారుణం తర్వాత సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) అక్రమ నిర్మాణాలపై తీవ్రంగా వ్యవహరిస్తోంది. గురువారం మూడు జోన్ల్లో నిర్వహించిన తనిఖీల్లో 54 అనధికార నిర్మాణాలు బయటపడగా, వాటిలో 21 భవనాలను అధికారులు కూల్చివేశారు. 14 చోట్ల నోటీసులు జారీ చేశారు. ఒక నిర్మాణాన్ని సీజ్ చేశారు.

కూల్చివేతలు మూడు జోన్లలో సాగాయి. శేరిలింగ ంపల్లి జోన్లో 9, కూకట్పల్లిలో 6, కుత్బుల్లాపూర్లో 6 భవనాలు నేలమట్టమయ్యాయి. మిగిలిన 33 కేసులపై తదుపరి చర్యలు చేపడతామని సీఎంసీ తెలిపింది.గచ్చిబౌలి ప్ర మాదం తర్వాతే ఈ డ్రైవ్ ముమ్మరమైంది. 75 గజాల లోపు ప్లాట్లపై ఏడు మీటర్ల కంటే ఎక్కువ ఎత్తున వస్తున్న నిర్మాణాలు, అనుమతి లేకుండా ఎత్తుతో సంబంధం లేకుండా వస్తున్న భవనాలపైనే ప్రస్తుతం దృష్టి. కమిషనర్ జి. శ్రీజన టౌన్ ప్లానింగ్, ఎన్ఫోర్స్మెంట్ బృందాలను ప్రతిరోజూ క్షేత్రస్థాయిలో తిరగాలని ఆదేశించారు.

అయితే ప్రజల్లో ప్రశ్నలు తగ్గడం లేదు, అంజయ్యనగర్లో భవనం కూలేంతవరకు అధికారులు ఎక్కడ ఉన్నారని స్థానికులు అడుగుతున్నారు. అనుమతి లేని నిర్మాణాలు సంవత్సరాల తరబడి కళ్లముందే ఎదిగాయని, ప్రమాదం జరిగాకే జేసీబీలు కదిలాయని విమర్శలు వస్తున్నాయి. సీఎంసీ మాత్రం నిబంధనల ప్రకారం చర్య లు కొనసాగుతాయని ప్రకటించింది.అక్రమ నిర్మాణాలు ఆగితేనే ప్రజల ప్రాణాలు సురక్షితంగా ఉంటాయి, లేదంటే మరో అంజయ్యనగర్ ఎప్పుడైనా పునరావృతం కావ చ్చు నిపుణులు హెచ్చరిస్తున్నారు.