5 లక్షలతో పాఠశాల ప్రహరీ గోడకు శంకుస్థాపన
22-04-2026 06:21 PM
శంకుస్థాపన చేసిన సర్పంచ్ రాఘవులు
కారేపల్లి,(విజయక్రాంతి): గుట్ట కింది గుంపు గ్రామపంచాయతీ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రహరీ గోడ నిర్మాణానికి సర్పంచ్ రాఘవులు చే శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఉండం రాఘవులు మాట్లాడుతూ... పాఠశాల అభివృద్ధి గ్రామ అభివృద్ధికి మూలస్థంభమని పేర్కొన్నారు. విద్యార్థులకు భద్రత కల్పించేందుకు ప్రహరీ గోడ నిర్మాణం ఎంతో అవసరమని తెలిపారు.
గ్రామ ప్రజల సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగవంతం చేస్తామని అన్నారు. ప్రహరీ గోడ నిర్మాణానికి డి యం ఎఫ్ టి నిధులు నుండి మంజూరు చేసిన వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్‌కు గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పాఠశాల అభివృద్ధి దిశగా ఇది ఒక కీలక అడుగు అని గ్రామస్తులు అభిప్రాయపడ్డారు.






