28 June, 2026 | 1:56 PM

Breaking News

రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి   •   సీఐ, ఎస్సై సస్పెన్షన్   •   ల్యాండ్ పూలింగ్‌పై రైతులకు, భూ యజమానులకు తహసిల్దార్ చంద్రశేఖర్ విజ్ఞప్తి   •  

కామారెడ్డి జిల్లా కేంద్రంలో కదలని ఆర్టీసీ బస్సులు

22-04-2026 06:26 PM

పోలీసులు ప్రయత్నాన్ని అడ్డుకున్న కార్మికులు

పోలీసులకు ఆర్టీసీ కార్మికుల మధ్య వాగ్వాదం

ఉదయం నుంచి నిలిచిపోయిన బస్సులు

బస్టాండ్ అవుట్ వద్ద బైఠాయించిన కార్మికులు

ఆర్డీవో వచ్చి నచ్చ చెప్పిన వినని ఆర్టీసీ కార్మికులు

పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆర్టీసీ కార్మికులు

కామారెడ్డి,(విజయక్రాంతి): తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెబాట కామారెడ్డి డిపోలో ఉద్రిక్తత దారితీసింది. తెల్లవారుజాము ననే డిపోకు చేరుకున్న ఆర్టీసి కార్మికులు బస్సులు బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. ప్రైవేట్ బస్సులను తిప్పేందుకు పోలీసుల సహాయంతో ఆర్టీసీ అధికారులు ప్రయత్నించిన కామారెడ్డిలో ఆర్టీసీ కార్మికులు అడ్డుకున్నారు. దీంతో కామారెడ్డి పట్టణ సిఐ నరహరి తో పాటు పోలీస్ సిబ్బంది, ఆర్టీసీ కార్మికులతో వాగ్వాదం నెలకొంది. పోలీసులు సహకరించాలంటే ఆర్టీసీ కార్మికులు నినాదాలు చేశారు. ఆర్టీసీ డిపో లాలో కామారెడ్డి బాన్సువాడలో ఆర్టీసీ కార్మికుల విధులు బహిష్కరించి డిపో గ్యారేజీ లేదట డిపో కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు.

ప్రయాణికులు కు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నే ఏర్పాట్లు చేస్తున్నామని తాత్కాలిక సిబ్బందిని నియమించి బస్సుదామని ఆర్టీసీ డిపో మేనేజర్ పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికులు మాత్రం అడ్డుకొని సమ్మె విజయవంతం చేశారు. కామారెడ్డి ఆర్డీవో గిరి డిపో కార్యాలయం ఆర్టీసీ కార్మికులతో చర్చించారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే వరకు ఆర్టీసీ బస్సులను నడవనివ్వమంటూ ఆర్టీసీ కార్మికులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. పోలీసులు తమ పట్ల దురుసుగా ప్రవర్తించారని ఆర్డీవో వై వి గిరి కితెలిపారు. ఎన్నికల ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతున్నామని వేరే గొంతమ్మ కోరికలు కోరడం లేదని ఆర్టీసీ కార్మికులు తెలిపారు. పోలీసుల ఓవరాక్షన్ తో ఆ కామారెడ్డి ఆర్టీసీ డిపో నుంచి అవుట్ గేటు వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. టెంటు వేసి బయటయించారు.

తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. కామారెడ్డి బస్టాండ్ లకు ఇతర ప్రాంతాలకు చెందిన బస్సులను రాకుండా అడ్డుకోవడంతోపాటు డిపో నుంచి బయటకు బస్సులు వెళ్లకుండా టెంటు వేసి బైఠాయించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా రాజ్యాధికార పార్టీ నాయకులు మద్దతు ప్రకటించారు. పోలీసుల మధ్య, ఆర్టీసీ కార్మికుల మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో బురదలో ముగ్గురు కార్మికులు పడిపోవడంతో పోలీసుల తీరిపై సిఐ నరహరి పై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికుల ఐక్యత కొనసాగాలని ప్రభుత్వం దిగివచ్చి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని నినాదాలు చేశారు. దీంతో ప్రయాణికులు ప్రైవేట్ వాహనాల వైపు పరుగులు తీయడంతో పాటు అధిక రేటు చెల్లించి ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణికులు ప్రయాణం చేశారు.