19 June, 2026 | 6:22 PM

కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలి

19-06-2026 04:31 PM

మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రజాపండరి

నిజాంసాగర్,(విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కార్యకర్తలు పట్టు విడుపు లేకుండా పనిచేయాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రజా పండరి సూచించారు ఆయన శుక్రవారం నాడు  నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తలు, సర్పంచులు, గ్రామ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నాయకుల సమావేశంలో మాట్లాడుతూ... పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.

రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సర్ (స్పెషల్ ఇంటెన్షవ్ రెవిషన్ ) కార్యక్రమంలో ప్రతి గ్రామంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు చురుకుగా పాల్గొనాలని సూచించారు. ఓటరు జాబితా సవరణలో (బూత్ లెవెల్ ఏజెంట్ ) పాత్ర అత్యంత కీలకమని, అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో నమోదు అయ్యేలా సహకరించాలని తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, పార్టీని గ్రామ స్థాయి నుంచి మరింత బలోపేతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, సర్పంచులు, గ్రామ అధ్యక్షులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.