రూ.83 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
ఐదు మున్సిపాలిటీలను పర్యటించిన మంత్రి వివేక్ వెంకటస్వామి
పటాన్ చెరు, మే 19పటాన్ చెరు నియోజకవర్గం పరిధిలో భానూర్, ఇస్నాపూర్, ఇంద్రేశం, జిన్నారం, గుమ్మడిదల, గడ్డపోతా రం మున్సిపాలిటీలో, తెల్లాపూర్ డివిజన్ ఉస్మాన్ నగర్ లో 83 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు మంగళవారం రా ష్ట్ర కార్మిక శాఖా మంత్రి వివేక్ వెంకటస్వామి స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. పటాన్ చెరు నుండి భానూరు గ్రామం వరకు 8 కోట్ల 30 లక్షల నిధులతో బీటి రోడ్డు నిర్మాణ పనుల కు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ... ఈ ప్రాం తంలో 1985వ సంవత్సరంలో కనీస రోడ్డు సదుపాయం కూడా లేదని, అలాంటిది 8 కోట్లతో నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం సం తోషమని అన్నారు. పటాన్ చేరు నుండి శం కర్పల్లి వరకు వంద పీట్ల రోడ్డు విస్తరణ కృషి చేస్తానని తెలిపారు. ఇందిరా గాంధీ హ యాంలో ఈ ప్రాంతానికి బీడీఎల్, ఓడిఎఫ్ డిఫెన్స్ పరిశ్రమలు తీసుకురావడం జరిగిందన్నారు. ఆమెను గుర్తు చేసుకోవాల్సిన అవ సరం ఎంతైనా ఉందన్నారు.
మీరు కోరుకున్నట్టుగానే ఈ ప్రాంతంలో ఇందిరా గాంధీ విగ్రహంతో పాటు, పటాన్ చెరు ఏరియా ఆ సుపత్రికి టంగుటూరు అంజయ్య పేరుకు కృషి చేస్తానన్నారు. ఇందిరమ్మ ఇండ్ల కోసం జూన్ రెండవ తారీఖు నుండి రెండవ విడత గా ఇవ్వనున్నట్లు తెలిపారు. ఒక్కో నియోజకవర్గానికి 2500 మంది వరకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వనున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వం లో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని, అర్హులైన అందరికీ రేషన్ కార్డులు ఇస్తున్నామని తెలిపారు.
పేదలను దృష్టిలో పెట్టుకుని మొన్న జరిగిన అసెంబ్లీలో సంక్షేమ పథకాల కోసం బడ్జెట్ కూడా పెంచిందని గుర్తు చేశారు. ఈ ప్రాంతంలో చాలా ఫ్యాక్టరీలు ఉన్నాయని దీ నికి సంబంధించిన నిధులు ఈ ప్రాంతానికి చెల్లిస్తే అభివృద్ధి ముందంజలో ఉండే అవకాశం ఉందన్నారు. మొన్నటి బడ్జెట్లో రెండు లక్షల కోట్ల బడ్జెట్ వరకు పేదలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ప్రకటించిందన్నారు. ఈ కార్యక్రమంలో టీజీఐఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, పటాన్ చెరు ఇంచార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.






