డీజిల్ కోసం వాహనదారుల పాట్లు
20-05-2026 12:44 AM
నిర్మల్, మే 19 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో రెండు రోజులుగా డీజిల్ కొరత ఏర్పడింది. పెట్రోల్ బంకుల్లో డీజిల్ లేకపోవడంతో ఉన్న బంకుల వద్దకు జనం పరుగులు తీస్తున్నారు. ముఖ్యంగా వ్యవసాయ సీజన్ కావడం పంట కోతలు రవాణా చేసుకునేందుకు అవసరమయ్యే డిజిల్ వాహనాలకు దొరకడం లేదు. దీంతో జిల్లాలోని కుంటాల కుబీర్ సారంగాపూర్ తదితర ప్రాంతాల్లో కొరత కారణంగా ఇతర ప్రాంతాల పెద్ద ఎత్తున వెళ్లి డీజిల్ తీసుకొని వస్తున్నారు.






