ఘనంగా ప్రపంచ ఆదివాసి దినోత్సవం
మహబూబాబాద్, ఆగస్టు 9 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంతో పాటు వివిధ ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించారు.
కొత్తగూడలో నిర్వహించిన ర్యాలీలో ఏజెన్సీ చట్టాలను పటిష్టంగా అమలు చేయాలి తుడుం దెబ్బ జాతీయ అధ్యక్షులు ఉపేందర్ డిమాండ్ చేశారు. గాంధీనగర్ గ్రౌండ్ నుండి సాంసృతి సంప్రదాయాలతో ర్యాలీగా కొత్తగూడ సెంటర్ లో భారత రాజ్యాంగ నిర్మాత బీ.ఆర్ అంబేద్కర్, ప్రొఫెసర్ బియ్యల జనార్దన్ రావు విగ్రహాలకు కు పూలమాలలు వేసి, కుమ్రం భీం విగ్రహం వద్దకు చేరుకొని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ జాతీయ అధ్యక్షులు వట్టం ఉపేందర్ జెండా ఆవిష్కరణ చేసి భీం విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు.
అనంతరం మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ0 ఆదివాసి లకు అన్ని రంగాలలో తీవ్ర అన్నాయం చేస్తున్నాయని 5 వ షెడ్యూల్ ఏజెన్సీ ప్రాంత చట్టాలను హక్కులను జీవో లను అమలు కాకుండా ఆదివాసీ లను అణిచివేతకు గురి చేస్తున్నాయి ఏజెన్సీ ఏరియాలో చట్టాలు అమలు కాక ఆదివాసీలు నిరుద్యోగులగా ఉండిపోతున్నారని, రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున్న తుడుం దెబ్బ ఉద్యమం ఊటుందని ప్రభుత్వన్ని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఆదివాసీ హక్కుల పోరాట సమితి నాయకులు మల్లెల రాము, పూనేం సందీప్, మల్లెల రాము, కుంజ నర్సింగ రావు, ఆదివాసీ ఉద్యోగులు వట్టం సాయిలు, చుంచ సారయ్య,పూనేం రామచందర్,సువర్ణపాక సమ్మయ్య, ఏంపల్లి సమ్మయ్య, వజ్జ సారయ్య, ఈసం స్వామి, ఆదివాసి సర్పంచ్ లు మల్లెల భాగ్యమ్మ, వట్టం శ్రీను బాబు, దనసరి ముత్తయ్య, ఈసం పుష్ప,ఆదివాసీ దొర పటేళ్ళు, ఆదివాసీ యువజన సంఘాలు తదితరులు పాల్గొన్నారు.






