మిషన్ భగీరథ ట్యాంకులకు రూ.1.92 కోట్ల నిధులు మంజూరు
వెంకటాపూర్, ఆగస్టు 9 (విజయక్రాంతి): మండలంలోని పలు గ్రామాల్లో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు మిషన్ భగీరథ వాటర్ ట్యాంకుల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బండి శ్రీనివాస్ తెలిపారు. మండలంలోని వెంకటాపూర్ గ్రామానికి రూ.38 లక్షలు, ఎల్లారెడ్డిపల్లికి రూ.38 లక్షలు, నల్లగుంటకు రూ.26 లక్షలు, జవహర్నగర్కు రూ.23 లక్షలు, కేశవాపూర్కు రూ.50 లక్షలు, చాతరాజుపల్లికి రూ.17.89 లక్షలు చొప్పున మొత్తం రూ.1.92 కోట్లకు పైగా నిధులు మంజూరయ్యాయని పేర్కొన్నారు.
గ్రామాల్లో తాగునీటి సరఫరాను మెరుగుపరిచేందుకు ఈ నిధులు ఎంతో దోహదపడతాయని బండి శ్రీనివాస్ అన్నారు. మండల ప్రజల తాగునీటి అవసరాలను గుర్తించి నిధులు మంజూరు చేయించిన తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క కు మండల ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే నిధుల మంజూరుకు సహకరించిన జిల్లా అధ్యక్షుడు అశోక్, టిపిసిసి ప్రధాన కార్యదర్శి రాంరెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ భగవాన్ రెడ్డి లకు ధన్యవాదాలు తెలిపారు.






