10 August, 2026 | 2:48 AM

‘గ్రహణం’ వీడని పల్లె దవాఖానలు!

10-08-2026 12:01 AM
  1. ఆరంభం కానివి కొన్ని..ప్రారంభానికి నోచుకోనివి మరికొన్ని
  2. పలు చోట్ల అవే అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలు
  3. పల్లెలో వైద్య సేవలు అందక ప్రజల అవస్థలు
  4. అన్ని సమస్యలు పరిష్కరించి అందుబాటులోకి తేవాలని విన్నపాలు

నేరేడుచర్ల, ఆగస్టు 9 : గ్రామీణ ప్రజలకు పట్టణ ప్రాంతాల్లో లభించే నాణ్యమైన ప్రాథమిక వైద్య సేవలను అందించాలన్న ఉద్దే శ్యంతో ఆరోగ్య ఉపకేంద్రాలను పల్లె దవాఖానాలుగా అభివృద్ధి చేశారు. వీటి ద్వారా ప్రజలకు సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సేవలు అందించడం, సాధారణ వ్యాధులకు ఉచిత మందులు అందుబాటులో ఉంచడం, ప్రాథమిక నిర్ధారణ పరీక్షలు (ల్యాబ్ టెస్టులు) నిర్వహించడం,అవసరమైతే టెలీమెడిసిన్ ద్వారా నిపుణుల సలహా అందించడం, గ్రామీణ ప్రజల వైద్య ఖర్చులను, ప్రయాణ భారాన్ని తగ్గించాలనేదే ముఖ్య ఉద్దేశ్యం. అయితే నేరేడుచర్ల మండలంలోని నేరేడుచర్ల, పెంచికల్ దిన్నె ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో ఏర్పాటు చేయాల్సిన పల్లె దవాఖానాలకు మాత్రం గ్రహణం పట్టింది.

స్థల సేకరణ జరగక, నిర్మాణానికి అనువుగా లేక, వివిధ కారణాలతో కొన్ని శంకుస్థాపనకు కూడా నోచుకోవడంలేదు. లక్షలు ఖ ర్చు చేసి నిర్మించినవి కూడా ప్రారంభంకాకపోవడం గమనార్హం. కారణాలు ఏవైనా మొత్తానికి ఆరంభం కానివి కొన్ని అయితే.. ప్రారంభానికి నోచుకోనివి మరికొన్నిగా మిగిలిపోయాయి.

దీంతో మండలంలో పల్లె దవాఖానకు పట్టిన గ్రహణం వీడడంలేదని పలువురు చర్చించుకుంటున్నారు. ఆరంభం కానివి కొన్ని,.. ప్రారంభం కానివి ఇంకొన్ని.. : ప్రాథమిక ఆరోగ్య కేంద్రము నేరేడుచర్ల పరిధిలో ఫేస్ -1 దశలోనే ఎంపికైన చిల్లేపల్లి, పాలకవీడు మండలంలోని కోమటికుంట,గుడుగుంట్ల పాలెం, గుండ్లపహాడ్ పల్లె దవాఖానాలలో కేవలం కేవలం గుడుగుంట్లపాలెంలోని పల్లె దవాఖాన మాత్రమే నిర్మాణo పూర్తయిoది. ఇటీవలే ఓపి సేవలు ప్రారంభిoచారు, ఫేస్ వన్ దశలోనే ఎంపికైన చిల్లేపల్లిలో స్లాబువేసి, గోడలు, దర్వాజాలు, కిటికీలు నిర్మించి మిగిలిన పనులు వదిలేశారు. ప్రస్తుతము దావాఖాన ఆవరణ నిరుపయోగ మొక్కలు, కంపచెట్లతో నిండిపోయి మందు బాబులకు, అసాంఘిక కార్యక్రమాలకి అడ్డాగా మారింది.

అలాగే కోమటికుంట గ్రామoలో పల్లె దవాఖాన కోసం స్థలం ఎంపిక జరగలేదు, గుండ్లపహాడ్ లోని దవాఖాన నిర్మాణ ప్రతిపాదిత స్థలము నిర్మాణానికి అనువుగా లేదంటూ పనులను వాయిదా వేశారు. పెంచికల్ దిన్న ఆరోగ్య కేంద్రం పరిధిలోని సోమారం, దిర్శించర్ల, పత్తేపురం, పెంచికల్ దిన్న గ్రామాలలో పల్లె దవాఖానాలు నిర్మించాల్సి ఉండగా కేవలం దిర్శించర్ల గ్రామంలో మాత్రమే పూర్తిస్థాయి నిర్మాణం జరిగిoది. సోమారం, పత్తేపురం గ్రామాలలో ఇటీవలే పల్లె దవాఖాన నిర్మాణానికి శంకుస్థాపనలు పూర్తవగా, పెంచికల్ దిన్నే గ్రామంలో ఇప్పటి వరకు స్థలo ఎంపిక జరగలేదు.

 ప్రారంభానికి నోచుకోని దవాఖానలు  

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పెంచికలదిన్నె పరిధిలోని దిర్శించర్ల గ్రామంలో పల్లె దవాఖాన పూర్తిస్థాయి నిర్మాణం జరిగినా ప్రారంభాన్ని మరిచిన అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ప్రస్తుతము దవాఖానా ఆవరణలో నిరుపయోగొక్కలు పెరగడంతో పాటు ప్రైవేటు వ్యక్తులు తమ సొంత పనులకు స్థలాన్ని వాడుకుంటున్నారు.

పాలకీడులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణం పూర్తయినా, ప్రారంభానికి నోచుకోకపోవడంతో లక్షల్లో ప్రజాధనం వెచ్చించి నిర్మించిన దవాఖానాలు వినియోగంలోకి రాకపోవడంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పూర్తి అయిన పల్లె దవాఖానలకు ప్రారంభించడంతో పాటు మిగిలిన చోట పనులు వేగవంతంగా చేసి తొందరగా ప్రజలు వైద్య సేవలను అందుబాటులోకి తేవాలని పలువురు కోరుతున్నారు.

కాంట్రాక్టర్ పనులు ఆపేశాడు 

 ఫేస్ వన్ లో ప్రారంభమైన చిల్లేపల్లి పల్లె దవాఖాన నిర్మాణము స్లాబు, గోడలు, కిటికీలు, దర్వాజాలు పూర్తయ్యాయి. కానీ చేసిన పనులకి బిల్లులు రాలేదు అంటూ కాంట్రాక్టర్ తదుపరి నిర్మాణ పనులు పూర్తిగా ఆపేశాడు. ఈ విషయంపై ఎన్నిసార్లు ఫోన్ లో సంప్రదించాలని ప్రయత్నించిన ఫోన్ తీయడం లేదు.త్వరలోనే కాంట్రాక్టర్ తో మాట్లాడి మిగతా పనులు కూడా పూర్తి అయ్యేలాగా చేసి, ప్రజలకు వైద్య సేవలు అందుబాటులోకి వచ్చేలా కృషి చేస్తా.

 పి నాగిని, వైద్యాధికారిణి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, నేరేడుచర్ల 

ఉన్నతాధికారుల ఆదేశాల రాగానే ప్రారంభిస్తాం 

దిర్శించర్ల గ్రామంలోని పల్లె దవాఖా నా నిర్మాణం పూర్తయి చాలా రోజులయింది.జిల్లా వైద్యారోగ్య శాఖ ఉన్నత అధికారుల ఆదేశాల కోసం చూస్తు న్నాం. ఆదేశాలు రాగానే దవాఖానా ప్రా రంభిస్తాం. సోమారం, పత్తేపు రం గ్రా మాలలో దవాఖానాల నిర్మాణాలకు ఇటీవలే శంకుస్థాపన చేశారు. పెం చికల్ దిన్నే లోని పల్లె దవాఖాన నిర్మా ణ ప్రతిపాదిత స్థలము రెవిన్యూ అధికారులు ఇంకా మాకు అప్పగించలేదు.

డా.సీతా మహాలక్ష్మి, పి.హెచ్.సి వైద్యాధికారిణి, పెంచికల్ దిన్నె