భక్తి బోనం
భాగ్యనగరంలో బోనాల సందడి
- ఆధ్యాత్మిక శోభతో పులకించిన పాతబస్తీ
- లాల్ దర్వాజాలో సింహవాహిని మహంకాళి బోనాలు
- బోనమెత్తిన కేంద్రమంత్రి బండి సంజయ్
- సింహవాహినికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రులు కొండా సురేఖ, పొన్నం
- అమ్మవారిని దర్శించుకున్న బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, నటుడు విజయ్ దేవరకొండ
రంగారెడ్డి, ఆగస్టు 9 (విజయక్రాంతి): భాగ్యనగరం బోనమెత్తింది. ఆషాఢ బోనాల ను పురస్కరించుకొని ఆదివారం ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నది. పాతబస్తీలోని ప్రసిద్ధ లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయంతోపాటు నగర వ్యాప్తంగా ఉన్న అన్ని మహంకాళి క్షేత్రాలు, అమ్మవారి ఆలయాలు అమ్మవారి నామస్మరణతో మార్మోగా యి. డప్పు చప్పుళ్లు, శివసత్తుల పూనకాలు, పోతురాజుల వీరంగాలు, ఆడపడుచుల పట్టువస్త్రాటలు, నెత్తిన బోనాలతో ఆలయ పరిస రాల్లో పండుగ వాతావరణం నెలకొన్నది.
లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారికి మంత్రి కొండా సురేఖ దేవాదాయ శాఖ తరఫున పట్టువస్త్రాలు సమర్పిం చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణపై ఎల్ నినో ప్రభావం పడకుండా, రైతాం గానికి మేలు జరుగుతూ సమృద్ధిగా వర్షాలు కురవాలని అమ్మవారిని వేడుకున్నట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి అమ్మవారి ఆశీస్సులు, సీఎం రేవంత్‌రెడ్డికి ఆర్థిక బలంతోపాటు రాష్ట్రానికి అభివృద్ధి శక్తులు చేకూరాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రార్థించారు.
పాతబస్తీ బోనాల ఉత్సవాల్లో సినీ, రాజకీయ ప్రముఖులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ నగరంలోని పలు ఆలయాల్లో అమ్మవార్లను దర్శించుకున్నారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి తలసాని శ్రీని వాస్ యాదవ్, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, ప్రభుత్వ సలహాదారు వీ హనుమంతరావు, సినీ నటుడు విజయ్ దేవరకొండ, ఆయన సోదరుడు ఆనంద్ దేవరకొండ, దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా లాల్ దర్వాజా ఆల యంలో అమ్మవారిని దర్శించుకున్నారు. టీ ఆర్‌ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత అమ్మవారికి బోనం సమర్పించారు.
మీరాలంమండిలో మాస్ డాన్స్??
మీరాలంమండి మహంకాళేశ్వర ఆలయంలో శనివారం కొణిదెల నిహారిక దర్శ నం చేసుకోగా, ఆదివారం మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి బంగారు బోనం ఎత్తి ప్రత్యేకత చాటుకున్నారు.
అమ్మవారి దర్శనం అనంతరం ఆమె స్థానిక భక్తులతో కలిసి ఊ పుతెప్పించే రీతిలో చేసిన గ్రామీణ మాస్ డాన్స్ పండుగ జోష్‌ను రెట్టింపు చేసింది. బో నాల జాతరలో ఎలాంటి అవాంఛనీయ సం ఘటనలు జరగకుండా నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ పర్యవేక్షణలో పోలీసులు కట్టు దిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 2,500 మంది పోలీసు బలగాలతో పాటు షీ టీమ్స్ రంగంలోకి దిగాయి.






