వాగ్దేవి విద్యార్థినికి 10/10 GPA
ముకరంపుర, జూలై 9(విజయక్రాంతి): శాతవాహన యూనివర్శిటీ ప్రకటించిన డిగ్రీ రెండవ సెమిస్టర్ ఫలితాల్లో కరీంనగర్ పట్టణంలోని స్థానిక " వాగ్దేవి డిగ్రీ, పీజీ " కళాశాల విద్యార్థిని కట్కూరి మనోజ్ఞ అత్యుత్తమoగా 10 GPA సాధించింది. ఈ సందర్భంగా కళాశాల ఛైర్మన్ గోవిందవరం కృష్ణ కట్కూరి మనోజ్ఞ ను అభినందించారు. కళాశాల ఛైర్మన్ గోవిందవరం కృష్ణ మాట్లాడుతూ డిగ్రీ లో కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని, ఇది కళాశాలకు ఎంతో గర్వకారణం అని తెలిపారు. కళాశాలలో అత్యంత అనుభజ్ఞులైన అధ్యాపకులు, అత్యున్నత ప్రమాణాలతో విద్యను అందించడం ద్వారానే ఇది సాధ్యమైందని అన్నారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ విద్యార్థులను అభినందించారు. ప్రిన్సిపాల్ ఏ. మునిందర్ గౌడ్ అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందించారు.






