27 July, 2026 | 6:40 PM

Breaking News

దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తి అరెస్ట్   •   పైతర పంచాయతీ కార్మికులకు ప్రమాద బీమా పత్రాల పంపిణీ   •   సర్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు   •   విద్యాబోధనలో నూతన విధానాలను అమలు చేయాలి   •   యూనియన్ బ్యాంకులో తెలుగు తెలిసిన సిబ్బందిని నియమించాలి   •   ఎల్ నినోను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి నిత్య కళ్యాణం   •   గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనాన్ని అమలు చేయాలి: జడ శ్రీనివాస్   •   డబుల్ బెడ్‌రూం ఇళ్ల సమస్యలపై కలెక్టర్‌కు సీపీఎం వినతి   •   ఎల్ నినో దృష్య వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి   •  

భాగీరథిపల్లిలో రూ.25 లక్షల కల్వర్టు నిర్మాణానికి భూమిపూజ

27-07-2026 05:57 PM

భిక్కనూర్,(విజయక్రాంతి): భిక్కనూర్ మండలం భాగీరథిపల్లి గ్రామంలో రూ.25 లక్షల వ్యయంతో చేపట్టనున్న కల్వర్టు నిర్మాణ పనులకు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి భూమిపూజ నిర్వహించారు. గ్రామ ప్రజల చిరకాల సమస్యను పరిష్కరించే దిశగా ఈ కల్వర్టు నిర్మాణం కీలకమని వారు పేర్కొన్నారు. వర్షాకాలంలో రాకపోకలకు ఏర్పడుతున్న ఇబ్బందులు ఈ పనులతో తొలగిపోతాయని, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గంగయ్యగారి నరసింహులు మాట్లాడుతూ, గ్రామాభివృద్ధికి అవసరమైన పనులను దశలవారీగా పూర్తి చేస్తున్నామని, కల్వర్టు నిర్మాణంతో రైతులు, గ్రామ ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని తెలిపారు.