20 June, 2026 | 10:24 PM

ప్రహరీ గోడకు భూమి పూజ

20-06-2026 09:15 PM

లింగాపూర్,(విజయక్రాంతి): మండలంలోని శనివారం జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కూడ్మేత విశ్వనాథ్ కేజీబివి పాఠశాలలో ప్రహరీ గోడ భూమి పూజ చేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ బాలికల పాఠశాలలో ప్రహరీ గోడలు తప్పనిసరి నిర్మించుకోవాలని ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు తమ ప్రభుత్వం తోనే సాధ్యం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ రాజశేఖర్, మండల విద్యాధికారి శ్రీనివాస్, ఇంజినీరింగ్ అధికారి శశిధర్, ఆర్ ఐ ప్రదీప్, మండల నాయకులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.