ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
20-06-2026 09:22 PM
నస్పూర్,(విజయక్రాంతి): 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు శనివారం మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ సింగరేణి ఏరియా జీఎం కార్యాలయ ఆవరణలో జీఎం మునిగంటి శ్రీనివాస్, ఫైనాన్స్ విభాగం సీనియర్ అసిస్టెంట్ సాంబయ్య పర్యవేక్షణలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ దైనందిన జీవితంలో యోగా అనేది ఒక భాగంగా మారాలన్నారు.
శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసానికి యోగా ఎంతో ప్రధానమన్నారు. ఇంట్లోనే కొంత సమయం వెచ్చిస్తే మంచి ఆరోగ్యంతో పాటు మానసికి ప్రశాంతత పొందవచ్చన్నారు. అనంతరం యోగా శిక్షకులు సాంబయ్యను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఏరియా వ్యాప్తంగా అన్ని గనులు, కార్యాలయాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.






