20 June, 2026 | 10:43 PM

గార్ల డిగ్రీ కళాశాలలో ఏఐ డిజిటల్ లెర్నింగ్ శిక్షణ

20-06-2026 09:25 PM

మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా గార్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) డిజిటల్ లెర్నింగ్ శిక్షణ కార్యక్రమం రెండు రోజుల పాటు నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి.రాజు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో తృతీయ సంవత్సరం, ఐదవ సెమిస్టర్ విద్యార్థులకు ఏఐ ఆధారిత డిజిటల్ లెర్నింగ్‌పై అవగాహన కల్పించారు. కేసముద్రం పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకులు ఆర్. వెంకటేశ్వర్లు మాస్టర్ ట్రైనర్‌గా హాజరై కృత్రిమ మేధస్సు వినియోగం, డిజిటల్ నైపుణ్యాలశ ప్రాధాన్యంపై విద్యార్థులకు సూచనలు అందించారు. కార్యక్రమంలో గార్ల, కేసముద్రం కళాశాలల నోడల్ అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.