20 June, 2026 | 10:25 PM

డ్రైవర్ల కోసం రెస్ట్ హాల్ ని ప్రారంభించిన జీఎం

20-06-2026 09:11 PM

నస్పూర్,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ సింగరేణి ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయం ప్రాంగణంలో డ్రైవర్ల కోసం ఏర్పాటు చేసిన రెస్ట్ హాల్ ను ఎస్ఓటూ జీఎం N . సత్యనారాయణతో కలిసి శనివారం శ్రీరాంపూర్ ఏరియా జీఎం మునిగంటి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ ఏరియా పరిధిలోని వివిధ డిపార్టుమెంట్లకు వాహనాలు నడుపుతున్న కాంట్రాక్టు డ్రైవర్ల విశ్రాంతి కోసం జీఎం కార్యాలయంలో నూతనంగా ఒక గదిని నిర్మించామని, ఖాళీ సమయంలో డ్రైవర్లు సేదదీరేలా ఏర్పాట్లు చేశామన్నారు.