20 June, 2026 | 10:47 PM

చేగుంటలో ఘనంగా ప్రపంచ యోగా దినోత్సవ వేడుకలు

20-06-2026 09:37 PM

చేగుంట: ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం చేగుంటలోని ప్రభుత్వ పాఠశాల  ఆవరణలో జరిగిన యోగా దినోత్సవ కార్యక్రమంలో యోగా సాధకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారని రాష్ట్ర యోగాసనా స్పోర్ట్స్ అసోసియేషన్ సీనియర్ ఉపాధ్యక్షులు జిల్లా అధ్యక్షుడు కరణం గణేశ్ రవికుమార్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన చేగుంట గ్రామ సర్పంచ్ స్రవంతి సతీష్ మాట్లాడుతూ... ఉదయం కానీ సాయంత్రం కాలకృత్యలు తీర్చుకొని సాధన చేయవచ్చని, యోగా మిగతా క్రీడల్లో కాకుండా యోగాకు పెద్దగా క్రీడా మైదానం గాని క్రీడా సామాగ్రి గాని అవసరం లేదని గాలి వెళ్తురు ఉండి ఆరు గజాల స్థలం ఉంటే సరిపోతుందని, 

యోగాన్ని చేయడానికి ఆరు సంవత్సరాల పైబడిన వారీ నుండి 100 సంవత్సరాలు పైనబదినవారు కూడా చేయవచ్చని తెలిపారు. కరణం గణేష్ రవికుమార్ మాట్లాడుతూ 2014 సంవత్సరంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రపంచ యోగ దినోత్సవం ప్రారంభించారని అప్పటినుంచి ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశంలో యోగా దినోత్సవం జరుపుకుంటున్నారని ఇది భారతీయులందరికీ గర్వకారనమని, యోగా చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని ప్రతి ఒక్కరూ ప్రతిరోజు యోగాను తప్పనిసరిగా చేయాలని ఆరోగ్యంగా ఉండడమే కాకుండా యోగ వల్ల ఉద్యోగ, ఉపాధి, ఉన్నత చదువులకు ఉపయోగపడుతుందని ఆయన అన్నారు.