రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో వస్తుంది
బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసం వెంకటేశ్వర్లు
నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): భారతీయ జనతా పార్టీ నాగిరెడ్డిపేట మండలం శాఖ ఆధ్వర్యంలో శనివారం కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసం వెంకటేశ్వర్లు హాజరైనారు. ఈ సందర్భంగా ఆయన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ... రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడబోతుందని తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలతో గద్దెనకి నేడు కనీస రాష్ట్ర ప్రజల సమస్యలను కూడా తీర్చడం లేదని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటై మూడు సంవత్సరాలు గడిచిన ఇప్పటివరకు ఎలాంటి రైతులకు ఉపయోగపడేటువంటి ప్రాజెక్టును ప్రారంభించలేదని రైతులు ఈ విషయాన్ని గమనించి రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని అన్నారు.హైదరాబాదులో హైడ్రా పేరుతో గరీబోళ్ల ఇండ్లను కులుస్తూ రేవంత్ రెడ్డి మాత్రం ప్రభుత్వ భూములను అమ్మేస్తూ సొమ్ము చేసుకుంటున్నాడని విమర్శించారు.
ఇకనైనా ఇకనైనా తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసాలను గ్రహించి రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టాలని అలాగే ఎల్లారెడ్డి నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగురవేయాలని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం పైడి ఎల్లారెడ్డి ఆధ్వర్యంలో సుమారు 200 మంది కార్యకర్తలు ఎర్రారం, జలాల్పూర్, ఆత్మకూర్, ఎర్రగుంట తండా, జాన్కంపల్లి, బొల్లారం,తాండూర్, మాసంపల్లి, మాల్తుమ్మెద, వదలపర్తి, నాగిరెడ్డిపేట, గ్రామాల నుండి యువకులు బిజెపి పార్టీలో చేరడం జరిగింది.






