20 June, 2026 | 10:47 PM

త్రివేణి పాఠశాలలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

20-06-2026 09:45 PM

కొత్తగూడెం,(విజయక్రాంతి): త్రివేణి పాఠశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని శనివారం రోజున ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ, యోగా శారీరక, మానసిక ఆరోగ్యాలను మెరుగుపరిచే గొప్ప సాధనమని పేర్కొన్నారు. ప్రతిరోజూ యోగా చేయడం ద్వారా ఆరోగ్యవంతమైన జీవనశైలి అలవడటంతో పాటు ఏకాగ్రత, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయని విద్యార్థులకు వివరించారు.

ఈ సందర్భంగా యోగా శిక్షకుల ఆధ్వర్యంలో విద్యార్థులు వివిధ యోగాసనాలు, ప్రాణాయామాలను ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు. యోగా వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తూ, ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో యోగాను ఒక భాగంగా చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులను, ఉపాధ్యాయిని ఉపాధ్యాయులను ."త్రివేణి పాఠశాల డైరెక్టర్లు గొల్లపూడి జగదీష్, డాక్టర్ గొల్లపూడి వీరేంద్ర చౌదరి, సీఆర్వో  కాట్రగడ్డ మురళీకృష్ణ, ప్రిన్సిపాల్స్ శ్రీనివాస్ సింగ్, సూర్యనారాయణ మూర్తి  వైస్ ప్రిన్సిపాల్ సౌజన్య అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.