24 July, 2026 | 5:18 PM

గిఫ్ట్ ఏ స్మైల్!

24-07-2026 04:14 PM

కేటీఆర్ జన్మదిన సందర్భంగా దివ్యాంగుడికి కిరాణా షాప్ ఏర్పాటు 

మహబూబాబాద్,(విజయక్రాంతి): బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినం సందర్భంగా గతంలో ఇచ్చిన హామీ మేరకు మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం తీగలవేణి గ్రామానికి చెందిన వినోద్ కుమార్ అనే దివ్యాంగుడికి రూ.2 లక్షల నిధులతో కిరాణా షాప్ ఏర్పాటు చేయించారు. హనుమకొండ జిల్లాలో గురువారం నిర్వహించిన గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో కేటీఆర్ వినోద్ కుమార్ కు రెండు లక్షల రూపాయల విలువైన కిరాణా సామాగ్రిని అందించి బోర్డును కూడా ఆవిష్కరించారు. ఈ మేరకు శుక్రవారం కేటీఆర్ జన్మదిన పురస్కరించుకొని తీగల వేణి గ్రామంలో వినోద్ కుమార్ ఏర్పాటు చేసిన కిరాణా షాపును గ్రామ పార్టీ అధ్యక్షుడు వేం మోహన్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం గ్రామంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.