22వ వార్డు అభివృద్ధి కార్యాలయం ప్రారంభం
ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి
ఆలేరు,(విజయక్రాంతి): భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని 22వ వార్డులో నూతనంగా ఏర్పాటు చేసిన వార్డు అభివృద్ధి కార్యాలయాన్ని ఆలేరు శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గురువారం ఘనంగా ప్రారంభించారు. 22వ వార్డు కౌన్సిలర్ జాలిగం విఘ్నేష్ తన వార్డు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ప్రజల సమస్యలను తెలుసుకుని, వారికి మెరుగైన సేవలు అందించేందుకు కార్యాలయం ఏర్పాటు చేయడం అభినందనీయమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి కౌన్సిలర్ విఘ్నేష్ ను అభినందించారు.
ఈ కార్యక్రమంలో భువనగిరి మున్సిపల్ చైర్ పర్సన్ తంగళ్లపల్లి శ్రీవాణి, వైస్ చైర్ పర్సన్ పోతంశెట్టి మంజుల, గ్రంథాలయ చైర్మన్ అవేజ్ చిస్తీ, మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్, పీసీసీ డెలిగేట్ రవికుమార్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు కూర వెంకటేష్ తో పాటు కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు చల్ల కిషోర్, బుషపాక మనీష్, తోట కార్తీక్, జాలిగం శివ, నర్సమ్మ, కోళ్ల ప్రవీణ్, బిక్షపతి, పల్లెర్ల రాములు, శివతేజ, బర్రె వరుణ్, సంతోష్, మహేందర్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.






