24 July, 2026 | 5:51 PM

కేటీఆర్ జన్మదిన వేడుకలు

24-07-2026 05:01 PM

చండ్రుగొండ,( విజయక్రాంతి):తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్  కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్)  జన్మదినాన్ని పురస్కరించుకుని చండ్రుగొండ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు.ఈ సందర్భంగా కేక్ కట్ చేసి కేటీఆర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వీట్లు పంపిణీ చేసి వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ... కేటీఆర్  ప్రజా సంక్షేమం, తెలంగాణ అభివృద్ధికి విశేష కృషి చేసిన నాయకుడని కొనియాడుతూ, ఆయన ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.