విద్యాసంస్థల బంద్ విజయవంతం
24-07-2026 04:18 PM
నీట్ విద్యార్థులకు న్యాయం చేయాలని విద్యార్థి సంఘాల డిమాండ్
సిద్దిపేట రూరల్: రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి సంఘాల పిలుపు మేరకు సిద్దిపేట రూరల్ మండలంలోని రాఘవాపూర్, ఇర్కోడ్, రాంపూర్ గ్రామాల్లో విద్యాసంస్థల బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్ఎస్యుఐ మండల అధ్యక్షుడు గ్యార రఘుపతి మహారాజ్ మాట్లాడుతూ... నీట్ విద్యార్థులకు న్యాయం చేయాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ)ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.






