24 July, 2026 | 5:58 PM

తాహసిల్దార్ ఎదుట ఇద్దరి బైండోవర్

24-07-2026 05:04 PM

సుల్తానాబాద్, జులై 24 (విజయ క్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ఎక్సైజ్ సిఐ గురునాథ్ రాథోడ్ ఆదేశాల మేరకు  నాటు సారా మరియు పటిక అమ్మిన ఇద్దరు వ్యక్తులపై కేసులు నమోదు చేసి,  ఇద్దరు మహిళలను  కాల్వ శ్రీరాంపూర్ తహసీల్దార్ రాపెల్లి రాముడు  ఎదుట శుక్రవారం బైండోవర్ చేసినట్లు ఎక్సైజ్ ఎస్సై  చిరంజీవి తెలిపారు, పెగడపల్లి కి చెందిన జట్ పట్ వసంత ,.అంతటి లక్ష్మీ వీరిని శ్రీరాంపూర్ తహసీల్దార్ ముందు ఒక లక్ష రూపాయలు పూచీకత్తు కు బైండోవర్ చేయటం జరిగింది అన్నారు , అలాగే,వీరి నుండి 25 కిలోల పటిక మరియు 8 లీటర్లు గుడుంబా స్వాధీనం చేసుకున్నామని ఎస్సై  చిరంజీవి తెలిపారు,