24 July, 2026 | 6:04 PM

సీఎస్ఆర్ సమ్మిట్‌కు అతిధిగా ఎమ్మెల్యే యెన్నం

24-07-2026 05:03 PM

మహబూబ్ నగర్, జూలై 24 (విజయ క్రాంతి) : దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద 3వ సిఎస్ఆర్ సమ్మిట్‌ కు అతిథిగా ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి హాజరు కానున్నారు. తెలంగాణ శాసనసభ ప్రభుత్వ విప్, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి  దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద 3వ సీఎస్ఆర్ సమ్మిట్ కాన్ఫరెన్స్, అవార్డ్స్ కార్యక్రమానికి అతిథిగా హాజరుకానున్నారు.

"Creating Legacy – Enduring Impact & Systemic Transformation" అనే ప్రధాన అంశంతో నిర్వహిస్తున్న ఈ ప్రతిష్ఠాత్మక సమ్మిట్‌లో కార్పొరేట్ సామాజిక బాధ్యత  ద్వారా సమాజాభివృద్ధి, సుస్థిర ప్రగతి, వ్యవస్థాగత మార్పులు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై జాతీయ స్థాయి చర్చలు జరగనున్నాయి. ఈ కార్యక్రమం శనివారం ఉదయం 10 గంటలకు గచ్చిబౌలిలోని బ్రహ్మకుమారీస్ శాంతి సరోవర్ ప్రాంగణంలోని గ్లోబల్ పీస్ ఆడిటోరియంలో నిర్వహించబడుతుంది. ఈ సమ్మిట్‌లో దేశంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ ప్రతినిధులు, సామాజిక సేవా సంస్థల ప్రతినిధులు, విధాన రూపకర్తలు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శయెన్నం శ్రీనివాస్ రెడ్డి  గౌరవ అతిథిగా పాల్గొని సభను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.