ఎస్ఐఆర్ ప్రక్రియ పరిశీలన
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలో కొనసాగుతున్న ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను కాంగ్రెస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కూచాడి శ్రీహరి రావు శుక్రవారం పరిశీలించారు. అస్రాకాలని, ఇంద్రానగర్, ద్యాగవాడ, ప్రియదర్శిని నగర్ తదితర ప్రాంతాల్లో కొనసాగుతున్న ఓటరు నమోదు ప్రక్రియను పరిశీలించి, బూత్ లెవల్ అధికారులను వివరాలు అడిగి వివరాలు తెలుసుకున్నారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో తప్పనిసరిగా నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలి.
ఈ ప్రక్రియలో బీఎల్‌వోలు, బీఎల్‌ఏలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఆన్‌లైన్ ప్రక్రియలో ఖచ్చితత్వం పాటిస్తూ ప్రతి దరఖాస్తును సకాలంలో నమోదు చేయాలని కోరారు. చిన్నపాటి పొరపాటు వల్ల కూడా అర్హులైన ఓటర్లు ఇబ్బందులు పడే అవకాశం ఉన్నందున ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా నమోదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఎర్రవతు రాజేందర్ శేఖర్ రమేష్ కిరణ్ ప్రవీణ్ సంతోష్ రవి పాల్గొన్నారు.






