24 July, 2026 | 5:58 PM

ఇసుక లారీ ఢీకొని యువకుడు మృతి

24-07-2026 05:11 PM

ఇల్లందు టౌన్,(విజయక్రాంతి): ఇల్లందులో శుక్రవారం జరిగిన రహదారి ప్రమాదంలో స్థానిక 2వ నంబర్ బస్తికి చెందిన నరేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. గౌతమ బుద్ధ ఐటీఐ కళాశాల సమీపంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న నరేష్‌ను వెనుక నుంచి వేగంగా వచ్చిన ఇసుక లారీ ఢీకొట్టడంతో తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. స్థానికంగా ఈ ఘటన విషాదాన్ని నింపింది.