గిఫ్ట్ ఏస్మైల్..
కేటీఆర్ జన్మదిన సందర్భంగా దివ్యాంగుడికి కిరాణా షాప్ ఏర్పాటు
మహబూబాబాద్, జులై 24 (విజయక్రాంతి): బీ ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినం సందర్భంగా గతంలో ఇచ్చిన హామీ మేరకు మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం తీగలవేణి గ్రామానికి చెందిన వినోద్ కుమార్ అనే దివ్యాంగుడికి 2 లక్షల రూపాయల నిధులతో కిరాణా షాప్ ఏర్పాటు చేయించారు. హనుమకొండలో గురువారం నిర్వహించిన గిఫ్ట్ ఏ స్త్మ్రల్ కార్యక్రమంలో కేటీఆర్ వినోద్ కుమార్ కు రెండు లక్షల రూపాయల విలువైన కిరాణా సామాగ్రిని అందించి నూతనంగా ఏర్పాటు చేసే కిరాణా షాపు బోర్డును కూడా కేటీఆర్ ఆవిష్కరించారు.
ఈ మేరకు శుక్రవారం కేటీఆర్ జన్మదిన పురస్కరించుకొని తీగల వేణి గ్రామంలో వినోద్ కుమార్ ఏర్పాటు చేసిన కిరాణా షాపును గ్రామ పార్టీ అధ్యక్షుడు వేం మోహన్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం గ్రామంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. తన అభిమానానికి కేటీఆర్ స్పందించిన తీరు పట్ల దివ్యాంగుడు అమితానందం వ్యక్తం చేశారు. ఎల్లప్పుడూ ఆయనకు రుణపడి ఉంటానని, కేటీఆర్ ప్రజల ఆశీర్వాదంతో కలకాలం ఆయురారోగ్యాలతో జీవించాలని వినోద్ ఆకాంక్షించాడు.






