calender_icon.png 21 February, 2026 | 12:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉద్యోగుల పదోన్నతులకు గ్రీన్ సిగ్నల్

21-02-2026 12:17:11 AM

  1. 27 మంది డిప్యూటీ సీఈఓలు సీఈఓలుగా, 55 మంది ఎంపీడీఓలు డిప్యూటీ సీఈఓలుగా ఉద్యోగోన్నతి

సుదీర్ఘకాలం తర్వాత ఉద్యోగులకు న్యాయం

మంత్రి సీతక్కకు అధికారుల ధన్యవాదాలు

హైదరాబాద్, ఫిబ్రవరి 20 (విజయక్రాం తి) : పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ లో సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పదోన్నతులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సం బంధిత శాఖ మంత్రి సీతక్క చొరవతో ఈ ప్రక్రియ వేగవంతమై, సంబంధిత ఉత్తర్వులను ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్. శ్రీధర్ జారీ చేశారు. ఈ నిర్ణయం ప్రకారం 27 మంది డిప్యూటీ సీఈఓలు సీఈఓలుగా పదోన్నతి పొందగా, 55 మంది ఎంపీడీఓలు డిప్యూటీ సీఈఓలుగా ఉద్యోగోన్నతి పొందారు. పదోన్నతులు పొంది న అధికారులు ప్రజా భవన్‌లో మంత్రి సీతక్క ను కలిసి సన్మానించారు.

సుదీర్ఘకాలం తర్వాత పదోన్నతులు కల్పించినందుకు ఆమెకు కతజ్ఞతలు తెలిపారు.   ఈ సందర్భంగా మంత్రి సీత క్క మాట్లాడుతూ ‘ప్రజా ప్రభుత్వం ఉద్యోగ ఫ్రెండ్లీ ప్రభుత్వం. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీతో పాటు, అర్హత కలిగిన వారికి సమయానుకూలంగా పదోన్నతులు కల్పించడం మా బాధ్యత’ అని స్పష్టం చేశారు. శాఖ బలోపేతం కావడం ద్వారా ప్రజలకు మరింత చేరువగా, సమర్థవంతమైన సేవలు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్య మని ఆమె తెలిపారు.

అదేవిధంగా, ఖాళీగా ఉన్న 28 ఎంపీడీఓ పోస్టుల నుంచి డిప్యూటీ సీఈఓలుగా, 15 మంది డిప్యూటీ సీఈఓల నుంచి సీఈఓలుగా పదోన్నతులు కల్పించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని మం త్రి హామీ ఇచ్చారు. ఎంపీడీవోల నుంచి అటెండర్‌ల వరకు ఖాళీగా ఉన్న అన్ని పోస్టుల్లో  దశలవారీగా పదోన్నతులు కల్పిస్తామని తెలిపారు.

ప్రజా ప్రభుత్వంలో మొదటిసారిగా అత్యధిక స్థాయిలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో పదోన్నతులు కల్పించడం ద్వారా శాఖను బలోపేతం చేసినట్టు మంత్రి పేర్కొన్నారు. ఈ చర్యలతో గ్రామీణ స్థాయిలో పరిపాలన మరింత మెరుగుపడుతుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.  కార్యక్రమంలో టీజీవో అధ్యక్షులు ఏలూరు శ్రీనివాస్ రావు, సీఈఓ, డిప్యూటీ సీఈఓ అసోసియేషన్ ఉపాధ్యక్షులు కొంపల్లి నర్సింహులు, ఎంపీడీఓ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.