13 May, 2026 | 4:43 PM

Breaking News

చిత్ర పరిశ్రమలో మరో విషాదం: ప్రముఖ నటుడు దిలీప్ రాజ్ కన్నుమూత   •   సీఎం రేవంత్ రెడ్డితో ఉబెర్ సీఈఓ భేటీ   •   జర్నలిస్ట్ కుమారుని వివాహానికి హాజరైన ఎమ్మెల్యే సామేలు   •   కేంద్ర సెన్సార్ బోర్డు సభ్యునిగా రాపాక ప్రవీణ్   •   రైతులు పండించిన జొన్న పంట మొత్తం కొనుగోలు చేయాలి   •   గీతంలో పాఠశాల విద్యార్థుల కోసం యంగ్ ఎంటర్ ప్రెన్యూర్స్ ప్రోగ్రామ్   •   నార్కో-టెర్రరిస్ట్‌ షేరా అరెస్ట్.. పోర్చుగల్ నుండి భారత్‌కు   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరినీ సమానంగా చూడటం లేదు   •   బొప్పపూర్ గ్రామంలో ప్లాస్టిక్ వాడకం నిషేధం   •   విమాన ప్రయాణికులకు ఎయిర్ ఇండియా షాక్   •  

పాలకవర్గం పదవీ బాధ్యతల స్వీకరణ

21-02-2026 12:17 AM

మున్సిపల్ చైర్మన్‌గా పత్యానాయక్, వైస్‌చైర్మన్‌గా గీత 

అమనగల్లు, ఫిబ్రవరి 20 (విజయక్రాంతి): అమనగల్లు మున్సిపాలిటీ నూతన పాలకవర్గం కొలువుదీరింది. మున్సిపల్ చైర్మన్గా నేనావత్ పత్యానాయక్, వైస్ చైర్మన్గా తల్లోజు గీత ఆచారి శుక్రవారం అట్టహాసంగా బాధ్యతలు స్వీకరించారు. శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ శంకర్ నాయక్ సమక్షంలో వారు పదవీ బాధ్యతలు చేపట్టారు.

ఈ కార్యక్రమానికి కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు తల్లోజు ఆచారి, పీసీబీ సభ్యుడు ఠాగూర్ బాలాజీ సింగ్ ముఖ్య అతిథులుగా హాజరై నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగాఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ అమంగల్ ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని ఆయన పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో అమనగల్లు ప్రజలు అభివృద్ధికి ఓటు వేయలేదని ముకింత అసహనం వ్యక్తం చేశారు.

ప్రాంత అభివృద్ధికి నిధుల కోసం సీఎం దగ్గరికి మీ కోసం వెళ్తానని, ప్రభుత్వ జూనియర్ కళాశాల సమస్యలను పరిష్కరించడంతో పాటు, డిగ్రీ మరియు పాలిటెక్నిక్ కళాశాలలకు సొంత భవనాలు నిర్మిస్తామని,పట్టణ యువత కోసం రూ. 10 కోట్లతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తామని ఆయన హామీనిచ్చారు. అమనగల్లుకు ఇప్పటికే ఏసీపీ కార్యాలయం మంజూరైందని, త్వరలోనే మరిన్ని డివిజన్ కార్యాలయాలను తీసుకొస్తామన్నారు.

ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని, ఇప్పటికే రూ. 63 కోట్లతో పట్టణంలో అభివృద్ధి పనులు చేపట్టామని గుర్తు చేశారు.  ఓబీసీ మాజీ మెంబర్ ఆచారి మాట్లాడుతూ  ఆమనగల్ అభివృద్ధికి కట్టుబడి ఉండే  మున్సిపల్ చైర్మన్ కు మద్దతు తెలిపామని ఆయన చెప్పారు. కొందరు రాజకీయ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని అలాంటి మాటలు ఆమనగలు పట్టడం ప్రజలు నమ్మవద్దని ఆయన హితవు పలికారు. ఆమనగలు అభివృద్ధికి అందరూ సహకారం అందించాలని కోరారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్పర్సన్ యాట గీత, టీపీసీసీ సభ్యుడు శ్రీనివాస్ గౌడ్, మాజీ జడ్పీటీసీలు కండ హరిప్రసాద్, నేనావత్ అనురాధ, మున్సిపల్ మేనేజర్ అంజనేయులు, కౌన్సిలర్లు కొగుడు అనిత, ఎర్రవోలు మహేష్, మొకాల వెంకటయ్య, నిరంజన్, సునీతతో పాటు, కాంగ్రెస్ బిజెపి శ్రేణులు పాల్గొన్నారు.