13 August, 2026 | 2:47 AM

మంత్రి శ్రీధర్ బాబుకు కృతజ్ఞతలు

13-08-2026 01:32 AM

మహాముత్తారం, ఆగస్టు 12 (విజయ క్రాంతి): వానాకాలంలో  ప్రాణాలకు తెగించి పెద్దవాగు దాటే  మా ప్రాంత ప్రజల కష్టాలని గుర్తించి, మా నిమ్మగూడెం ప్రజల చిరకాల స్వప్నమైన పెద్దవాగు బ్రిడ్జి నిర్మాణం కోసం రూ,7 కోట్ల పైచిలుకు నిధులు మంజూరు చేసిన మన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రివర్యులు  దుద్దిల్ల శ్రీధర్ బాబుకు మా నిమ్మగూడెం గ్రామ ప్రజల పక్షాన కాంగ్రెస్ నాయకులుబౌతు రాజేందర్   కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనునిత్యం రద్దీగా ఉండే ఆ రోడ్డు మార్గం ఈ బ్రిడ్జి నిర్మాణంతో యావత్ తెలంగాణ  మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల ప్రజలు కూడా రాకపోకలు ఎంతో సౌలభ్యం కలుగుతుందని అలాగే రైతులకు, ప్రజలకు,విద్యార్థులకు, అత్యవసర సమయంలో ఇది ఎంతో ఉపయోగ పడుతుందని, ప్రజాసమస్యపై సానుకూలంగా స్పందించి వెంటనే నిధుల కేటాయింపుకు శ్రీకారం చుట్టిన మంత్రి కి, అధికారులకు  నిమ్మగూడెం గ్రామ ప్రజల తరుపున మరోసారి కృతజ్ఞతలు తెలిపారు.