రుద్రంగి పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
రుద్రంగి ఆగస్టు 12(విజయక్రాంతి)రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి పొలిస్టేషన్ ను వార్షిక తనిఖీల్లో భాగంగా జిల్లా ఎస్పీ మహేష్ బి గితే తనిఖీ చేశారు. స్టేషన్ పరిధిలో నమోదైన కేసులు, పెండింగ్ కేసుల దర్యాప్తు పురోగతి, స్టేషన్ రికార్డుల నిర్వహణ, సిబ్బంది హాజరు,పెట్రోలింగ్ నిర్వ హణ, రౌడీషీటర్లు, పాత నేరస్తులపై నిఘా తదితర అంశాలను క్షుణ్ణంగా సమీక్షించి, ప్ర జలకు అందిస్తున్న పోలీసు సేవలపై ఆరా తీసారు.పోలీస్ స్టేషన్ అధికారులు, సిబ్బంది పనితీరు భేషుగ్గా ఉందని అభినందించారు. క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్ట మ్స్ లో అందుబాటులోకి వస్తున్న అధునాతన సాంకేతిక పద్ధతులను సిబ్బంది అంది పుచ్చుకోవాలని సూచించారు..ఎస్పీ వెంట డిఎస్పీ శ్రీనివాసులు,సి.ఐ రవీందర్, ఎస్.ఐ మోతిలాల్, సిబ్బంది పాల్గొన్నారు.






