9 April, 2026 | 12:02 AM

విజయవంతానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు

08-04-2026 09:48 PM

- మొదటిసారిగా జిల్లాకు వచ్చిన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు ఘన స్వాగతం పలికాం 

- డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్

మహబూబ్ నగర్,(విజయక్రాంతి): డీసీసీ కమిటీ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి నాయకుడు, కార్యకర్తకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. డీసీసీ కమిటీ నూతన కార్యవర్గం కార్యక్రమానికి టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని కమిటీ సభ్యులకు నియామకపత్రాలు ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు.

టీపీసీసీ అధ్యక్షుడిగా నియామకం అయిన తర్వాత మహబూబ్ నగర్ కు మొదటిసారిగా వచ్చిన మహేష్ కుమార్ గౌడ్ కు స్వాగతం పలకడానికి పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో హాజరుకావడం ఆనందంగా ఉందన్నారు. డీసీసీ కమిటీ నియామకంతో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. జిల్లాలోని ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు, అన్ని అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తల సహకారంతో జిల్లాలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. రానున్న 2029 ఎన్నికల్లో కేంద్ర, రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకురావడానికి ప్రతి కార్యకర్త పట్టుదలతో కృషి చేయాలని సంజీవ్ ముదిరాజ్ కోరారు.