8 April, 2026 | 11:59 PM

బెల్ట్ షాపు నిర్వాహకుడిపై కేసు

08-04-2026 10:03 PM

- 26 లీటర్ల మద్యం సీజ్

సిద్దిపేట క్రైం: దుబ్బాక మండలంలోని అప్పనపల్లి గ్రామంలో బెల్ట్ షాపు నిర్వాహకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మెరుగు సత్యనారాయణ (48) అనే వ్యక్తి తన ఇంట్లో మద్యం విక్రయించడంతోపాటు సిట్టింగ్ నిర్వహిస్తున్నట్టు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది.  టాస్క్‌ఫోర్స్, దుబ్బాక పోలీసులు నిర్వహించిన ఈ దాడుల్లో 26.09 లీటర్ల మద్యం లభించింది. సత్యనారాయణపై కేసు నమోదు చేసి, మద్యాన్ని  సీజ్ చేసినట్టు దుబ్బాక ఎస్ఐ కీర్తిరాజు తెలిపారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.