8 April, 2026 | 11:59 PM

ధర్మారం గ్రామంలో హెల్త్ అవేర్నెస్ కార్యక్రమం

08-04-2026 10:05 PM

– కార్మికులకు సల్ల పాకెట్ల పంపిణీ

కోనరావుపేట,(విజయక్రాంతి): కోనరావుపేట మండలం ధర్మారం గ్రామంలో బుధవారం రోజు ఆరోగ్య అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఉపాధి హామీ పనులు జరుగుతున్న ప్రదేశంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టి, కార్మికులకు ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మిర్యాల కార్ బాలాజీ ఉపాధి హామీ పనులు చేస్తున్న కార్మికులకు సల్ల పాకెట్లు పంపిణీ చేశారు. ఆరోగ్య సంరక్షణ, పరిశుభ్రత, వేసవి కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై హెల్త్ డిపార్ట్మెంట్ బృందం వివరించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, ఏపీవో ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొని కార్మికులతో మమేకమయ్యారు.గ్రామస్థులు ఈ కార్యక్రమాన్ని అభినందించారు.