9 April, 2026 | 12:00 AM

సర్వీస్, రూల్స్ తో పాటు కన్వర్షన్ ఇవ్వాలి

08-04-2026 09:59 PM

పీస్ రేట్ వర్కర్లకు జీవో నెంబర్ 11 ప్రకారం వేతనాలు వర్తింపజేయాలి

విద్యుత్ సంస్థల్లో పని చేస్తున్న అధికారుల సమ్మె సైరన్

ఎల్లారెడ్డి,(విజయక్రాంతి): సర్వీస్ రూల్స్ తో పాటు కన్వర్షన్ ఇవ్వాలి, పీస్ రేట్ వర్కర్లకు జీవో నెంబర్ 11 ప్రకారం వేదనాల అందించాలి. విద్యుత్ ఉద్యోగుల సమ్మె బాటలో ఆవేదన. ఎల్లారెడ్డి పట్టణంలోని విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న టీవీ ఏ ఈ జెఎసి ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి డివిజన్ ఆఫీసర్ కార్మికులు అండ్ పలువురు ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. సమ్మెలో పాల్గొన్న ఉద్యోగులు మాట్లాడుతూ విద్యుత్ శాఖ లో పనిచేస్తున్న ఏపీఎస్ఈ డబ్ల్యూ సర్వీస్ రూల్స్ తో పాటు కన్వర్షన్ ఇవ్వాలి.

అదే విధంగా హనుమాన్ కార్మికులకు టీజీఎస్పీడీసీఎల్ కంపెనీ తరహాలో ఆర్టిసిన్ కార్మికులుగా గుర్తించాలి మరియు ఫీస్ రేట్ వర్కర్లకు జీవో నెంబర్ 11 ప్రకారం వేతనాలు వర్తింపజేసే విధంగా సమకూర్చాలని జేఏసీ కో కన్వీనర్ సంతోష్ నాయక్ పీజీ ఎన్పీడీసీఎల్ కంపెనీ కన్వీనర్ హెచ్ శ్రీకాంత్ కంపెనీ ఆర్గనైజేషన్ సెక్రటరీ ఈ విజయ్ కుమార్ ఉమ్మడి జిల్లా సెక్రటరీ అయ్యారు రాఘవ చారి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి డివిజన్లోని విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న పలువురు అధికారులు రాజేందర్ ఎం రాజా గౌడ్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.